అమరావతిలో ‘బసవతారకం’
ABN , Publish Date - May 01 , 2026 | 04:26 AM
రాజధాని అమరావతిలో శుక్రవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సంస్థ చైర్మన్....
నేడు క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం!.. జీ ప్లస్ 9.. 500 పడకలతో నిర్మాణం
గుంటూరు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో శుక్రవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ తుళ్లూరులో ఉదయం 9గంటలకు ఈ పనులు ప్రారంభిస్తారు. తొలి దశలో జీ ప్లస్ 9 అంతస్తులతో నిర్మించే ఈ ఆస్పత్రిలో 500 పడకలు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో మరో 500 పడకలతో విస్తరించనున్నారు. ఇందుకు 750 కోట్లు ఖర్చవుతుందని అంచనా.