Share News

పాస్టర్‌ ఆనంద్‌ ‘ఎస్సీ హోదా’పై నేడు నిర్ణయం!

ABN , Publish Date - May 23 , 2026 | 05:58 AM

పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు వివాదానికి సంబంధించి బాపట్ల కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ శనివారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

పాస్టర్‌ ఆనంద్‌ ‘ఎస్సీ హోదా’పై నేడు నిర్ణయం!

  • ఈ నెల 19నే పూర్తయిన తుది విచారణ

  • కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో జాప్యం

బాపట్ల, మే 22(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ఆనంద్‌ ఎస్సీ హోదా రద్దు వివాదానికి సంబంధించి బాపట్ల కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ శనివారం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ అంశంలో తుది విచారణ మే 19నే పూర్తి అయినప్పటికీ కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో నిర్ణయం వాయిదా పడింది. అడ్మినిస్ట్రేటివ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమంలో వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ శిక్షణ శుక్రవారం ముగియడంతో కలెక్టర్‌ శనివారం నుంచి విధులకు హాజరుకానున్నారు. విచారణ సందర్భంగా పాస్టర్‌ ఆనంద్‌ ఇచ్చిన ఆధారాలపై యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు పిటిషనర్‌ అక్కల రామిరెడ్డి అభ్యంతరాలను కూడా నివేదిక రూపంలో సిద్ధం చేశారు. ఇవన్నీ కలెక్టర్‌ వద్దకు శనివారం చేరనున్నాయి. వీటిని బేరీజు వేసుకోవడంతో పాటు రూల్‌ ప్రొసీజర్‌, అత్యున్నత న్యాయస్థానం తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఎస్సీ హోదాపై కలెక్టర్‌ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - May 23 , 2026 | 05:58 AM