బన్ని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: తహసీల్దారు
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:52 PM
దేవరగట్టు మాళ సహిత మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆలూరు తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, ఎస్ఐ మన్మథవిజయ్ అన్నారు.
ఆలూరు రూరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దేవరగట్టు మాళ సహిత మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆలూరు తహసీల్దార్ శోభాసువర్ణమ్మ, ఎస్ఐ మన్మథవిజయ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కరిడిగుడ్డం, ముద్దనగేరి గ్రామాల్లో బన్ని ఉత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్సవాల్లో హింసకు తావు లేకుండా భక్తులు ఉత్సవాల్లో ప్రశాంతంగా పండగను జరుపుకోవాలని సూచించారు. రింగు కర్రలను బన్ని ఉత్సవాల్లో తీసుకుని వెళ్లరాదన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్ఐ బసవన్నగౌడ్, వీఆర్వో మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.