ఐదు రోజుల పనిదినాలు కావాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:20 AM
బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ఒక్క రోజు సమ్మె చేపట్టడంతో మంగళవారం బ్యాంకు కార్యకలాపాలు స్తంభించాయి.
బెజవాడ ధర్నాచౌక్‌లో యూఎ్‌ఫబీయూ ఆధ్వర్యంలో ధర్నా
విజయవాడ అర్బన్, నెల్లూరు(హరనాథపురం), జనవరి 27(ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు అధికారులు, ఉద్యోగులు ఒక్క రోజు సమ్మె చేపట్టడంతో మంగళవారం బ్యాంకు కార్యకలాపాలు స్తంభించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ నాయకుల పిలుపు మేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎ్‌ఫబీయూ) ఏపీ విభాగం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూఎ్‌ఫబీయూ ప్రతినిధి, ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ బి.ఎ్‌స.ఆర్.రాజశేఖర్ మాట్లాడుతూ 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం 2, 4వ శనివారాలను సెలవులుగా ప్రకటించారని, మిగతా శనివారాలను కూడా సెలవులుగా మార్చే అంశాన్ని పరిశీలిస్తామని అప్పట్లో ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో అమరావతి సర్కిల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.కాశీవిశ్వనాథ్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమ్మెలో 9 యూనియన్లకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.