పనిచేసే బ్యాంకుకే కన్నం!
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:28 AM
బ్యాంకులో తా కట్టు పెట్టిన బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగుల సహకారం తో అప్రైజరే దోచేసిన ఘటన ఇది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..
6 కేజీల బంగారాన్ని అపహరించిన అప్రైజర్
4 కేజీల బంగారం.. పది లక్షల నగదు స్వాధీనం
మరో ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ
ఏలూరు క్రైం, జూలై 10(ఆంధ్రజ్యోతి): బ్యాంకులో తా కట్టు పెట్టిన బంగారాన్ని ఆ బ్యాంకు ఉద్యోగుల సహకారం తో అప్రైజరే దోచేసిన ఘటన ఇది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడి నుంచి నాలుగు కేజీల 120 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. చలపాక రాజు(40) జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంకులో 176 మంది ఖా తాదారులు రుణాల కోసం తనఖా పెట్టిన మొత్తం ఆరు కిలోల 449 గ్రాముల బంగారు ఆభరణాలను 2024 నుం చి రాజు దఫదఫాలుగా అపహరించుకుపోయాడు. వాటిని వివిధ ప్రాంతాల్లో తాకట్టు పెట్టాడు. నిందితుడు చలపాక రాజును అరెస్టు చేసి కేజీల 120 గ్రాముల బంగారపు వస్తువులు, పది లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని చెప్పారు.