Share News

జైలుకు బండి నిత్యానందరెడ్డి

ABN , Publish Date - May 13 , 2026 | 05:24 AM

పెద్ద దస్తగిరి హత్యకేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్‌, వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డిని 14 రోజులు రిమాండ్‌కు కడప స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ...

జైలుకు బండి నిత్యానందరెడ్డి

కడప రూరల్‌, మే 12(ఆంధ్రజ్యోతి): పెద్ద దస్తగిరి హత్యకేసులో కడప మాజీ డిప్యూటీ మేయర్‌, వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డిని 14 రోజులు రిమాండ్‌కు కడప స్పెషల్‌ మొబైల్‌ కోర్టు (జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌) జడ్జి ఎం.ఆశాప్రియ ఆదేశించారు. పెద్దదస్తగిరి గత నెల 6న రిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బండి నిత్యానందరెడ్డి ఇంతకాలం పరారీలో ఉన్నారు. అయితే సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో లొంగిపోవడంతో చిన్నచౌకు పోలీ్‌సస్టేషన్‌ పోలీసులు ఆయనను ఆదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలోని స్పెషల్‌ మొబైల్‌ కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ఆశాప్రియ రిమాండ్‌కు ఆదేశించడంతో పోలీసులు ఆయనను కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

Updated Date - May 13 , 2026 | 05:24 AM