Share News

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

ABN , Publish Date - Feb 13 , 2026 | 03:44 AM

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి

  • ప్రమాణం చేయించిన సీజే జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజీ మెడమల్లి గురువారం ప్రమాణం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ నియామకంపై రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులను రిజిస్ట్రార్‌ జనరల్‌ పార్థసారధి చదివి వినిపించారు. న్యాయవాదిగా పనిచేస్తున్న బాలాజీని హైకోర్టులో న్యాయమూర్తిగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సీజే గురువారం బాలాజీతో ప్రమాణం చేయించారు. హైకోర్టులో మొత్తం 37మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉండగా, ప్రస్తుతం 32 మంది మాత్రమే ఉన్నారు. బాలాజీ నియామకంతో ఆ సంఖ్య 33కు చేరింది. ప్రమాణస్వీకారం అనంతరం న్యాయమూర్తి జస్టిస్‌ బాలాజీ మెడమల్లి.. జస్టిస్‌ రవినాథ్‌తిల్హరితో బెంచ్‌ పంచుకొని కేసులు విచారించారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాలాజీ కుటుంబసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌, అదనపు ఏజీ సాంబఽశివ ప్రతాప్‌, పీపీ మెండ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు, అధికారులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 03:44 AM