Share News

మిథున్‌రెడ్డి బెయిల్‌ షరతులు సడలింపు

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:22 AM

మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ-4) బెయిల్‌ షరతులు సడలిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పు ఇచ్చారు.

మిథున్‌రెడ్డి బెయిల్‌ షరతులు సడలింపు

విజయవాడ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (ఏ-4) బెయిల్‌ షరతులు సడలిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పు ఇచ్చారు. పాస్‌పోర్టును సిట్‌ అధికారులకు అప్పగించాలని, ప్రతి శుక్రవారం సిట్‌ కార్యాలయంలో సంతకం చేయాలని బెయిల్‌ ఇచ్చే సమయంలో ఆదేశించారు. ఈ తీర్పుపై మిథున్‌రెడ్డి గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం వాదప్రతివాదనలు ముగిశాయి. సిట్‌ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని, పాస్‌పోర్టు తీసుకోవడానికి రూ.లక్ష డిపాజిట్‌ చేయాలని న్యాయాధికారి భాస్కరరావు తీర్పునిచ్చారు.

Updated Date - Apr 09 , 2026 | 06:23 AM