పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:06 AM
పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గురజాల పదో అదనపు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
మాచర్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గురజాల పదో అదనపు కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గతేడాది మే నెలలో జరిగిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జెవిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఏ6), పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి (ఏ7)పై కేసులు నమోదు కాగా, నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ నెల 18న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు చేసిన గురజాల పదో అదనపు కోర్టు జడ్జి ప్రినియదర్శిని గురువారం పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు.