ముగిసిన బడేసాహెబ్ స్వామి ఉరుసు
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:37 AM
గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మా బడేసాహెబ్ స్వామి వారి ఉరుసు మహోత్సవం మంగళవారం జియారత్ గంధంతో ఘనంగా ముగిసింది.
ఘనంగా జియారత పూజలు
గోనెగండ్ల, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): గంజహళ్లి గ్రామంలో వెలసిన మహాత్మా బడేసాహెబ్ స్వామి వారి ఉరుసు మహోత్సవం మంగళవారం జియారత్ గంధంతో ఘనంగా ముగిసింది. ఉదయం దర్గా పీఠాధిపతులు స్వామి వారి గంధంతో మేళతాళాలతో ఉరేగింపుగా దర్గాను చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్వామి వారి జీవసమాధికి భక్తితో గంధం పట్టించారు. సమాధిని పూలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పీఠాధిపతుల ఇంటి నుంచి గంధంను దర్గాకు తీసుకువెలుతున్న మార్గంలో భక్తులు పీఠాధిపతులను ప్రత్యేకంగా పూలు, జలం, అత్తరుతో పూజించారు. ఉరుసు సందర్భంగా పలు ప్రాంతాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఉరుసులో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బదోబస్తు నిర్వహించారు.
కోట్ల హర్షవర్ధనరెడ్డి ప్రత్యేక పూజలు
గంజహళ్లి బడేసాహెబ్ స్వామివారి జియారత పూజలు మంగళవారం ఘనంగా జరిగాయి. కూడా మాజీ చైర్మన, వైసీపీ కోడుమూడు నియోజకవర్గ ఇనచార్జి కోట్ల హర్షవర్ధనరెడ్డి, వైసీపీ అనుబంధ సంస్థ రాష్ట్ర కార్యదర్శి అలువాల ప్రమోద్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీపీ, మండల వైసీపీ అధ్యక్షుడు వేముగోడు కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షడు మురహరిరెడ్డి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్గా పీఠాధిపతులు చిన్న ముద్దుగోలు స్వామి, మహాబూబ్ బాషా నాయకులకు సాదరంగా స్వాగతం పలికి శాలువా పూలమాలతో సన్మానించారు. పూజా కార్యక్రమంలో కిరణ్‌కుమార్, పరమేష్, చిరంజీవి, సూర్య, రమేష్ పాల్గొన్నారు.