స్కూళ్లకు బచ్చు ట్రస్టు 5 కోట్ల విరాళం
ABN , Publish Date - Mar 11 , 2026 | 05:27 AM
పీ-4 కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి బచ్చు చారిటబుల్ ట్రస్టు రూ.5కోట్ల విరాళం ప్రకటించింది.
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): పీ-4 కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి బచ్చు చారిటబుల్ ట్రస్టు రూ.5కోట్ల విరాళం ప్రకటించింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో ఈ నిధులు వినియోగించనున్నట్లు ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీలు బచ్చు కృష్ణకుమార్ దంపతులు తెలిపారు. త్వరలో చేపట్టబోయే అభివృద్ధి పనుల శంకుస్థాపనకు హాజరుకావాలని మంత్రి లోకేశ్‌ను మంగళవారం ఉండవల్లిలో కలిసి ఆహ్వానించారు. అలాగే కొవ్వూరుపల్లి పీహెచ్‌సీ అభివృద్ధికి రూ.5 కోట్లు, కొండ బిట్రగుంటలోని ప్రసన్నవేంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.5 కోట్ల విరాళాన్ని అందించారు.