Share News

బిడ్డా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా..

ABN , Publish Date - Apr 03 , 2026 | 10:37 PM

బిడ్డా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయా వా.. ఇప్పుడే వస్తానని, చెప్పి ఎక్కడికి వెళ్లావు నాన్నా..

   బిడ్డా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా..
మృతి చెందిన కన్నకొడుకును గుండెలపై హత్తుకుని రోధిస్తున్న తల్లి వెంకటలక్ష్మి

బంధువులను శుభకార్యానికి ఆహ్వానించేందుకు వెళ్తూ..

ఫ ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

కోసిగి-సజ్జలగుడ్డం రోడ్డులో ఘటన

ఫ కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు

కోసిగి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): బిడ్డా.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయా వా.. ఇప్పుడే వస్తానని, చెప్పి ఎక్కడికి వెళ్లావు నాన్నా.. అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆతల్లిదండ్రులు. శుక్రవారం గుడ్‌ ఫ్రైడే కావ డంతో బడికి సెలవు ఇచ్చారు. పెదనాన్న కూతురు నిశ్చితార్థానికి బంఽ దువులను ఆహ్వానించేందుకు బైక్‌పై వెళ్తూ అనంతలోకాలకు చేరుకు న్నాడు 9వ తరగతి విద్యార్థి. ఇంటి నుంచి వెళ్లిన పది నిమిషాలకే ఆర్టీసీ బస్సు మృత్యురూపంలో అతడిని కబలించింది. ఈఘటన కోసిగి -సజ్జలగుడ్డం రోడ్డులో నాగప్పకట్ట సమీపంలో చోటుచేసుకున్నట్లు సీఐ మంజునాథ్‌, ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు. వివరాలు.. కోసిగిలోని వాల్మీ కినగర్‌కు చెందిన కంపాటి శ్రీనివాసులు, వెంకటలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు నరసింహులు(16) కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం బడికి సెలవు కావడంతో తన పెదనాన్న కూతురు నిశ్చి తార్థానికి బంధువులను ఆహ్వానించేందుకు సోదరుడు విజయగో పాల్‌తో కలిసి బైక్‌పై సజ్జలగుడ్డంకి బయలుదేరారు. నాగప్పకట్ట వద్దకు చేరుకోగానే అతివేగంగా వస్తున్న ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తప్పించబోయారు. బైక్‌ అదుపు తప్పడంతో డ్రైవింగ్‌ చేస్తున్న విజయకుమార్‌ ఎడమ వైపునకు పడిపోగా, కుడివైపున నరసిం హులు కింద పడ్డాడు. వేగంగా వచ్చిన బస్సు అతడిపై నుంచి వెళ్లడం తో నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. విజయగోపాల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరు కొని గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కురువ మల్లికార్జునపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Apr 03 , 2026 | 10:37 PM