పన్నుతో జన్మించిన శిశువు
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:57 AM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ఆడ శిశువు పన్నుతో జన్మించింది. శిశువుకు పాలు ఇవ్వడం..
ద్రాక్షారామ, జూలై 6(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ఆడ శిశువు పన్నుతో జన్మించింది. శిశువుకు పాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉండటంతో స్థానిక దంత వైద్యుడు డాక్టర్ క్రాంతికుమార్ ఆ పన్ను తొలగించారు. పుట్టిన పిల్లల్లో ఆరు నెలలకు రావాల్సిన పాల దంతాలు జన్యుపరమైన వ్యత్యాసాలతో అరుదుగా పుట్టుకతో రావడం జరుగుతుందని తెలిపారు. పన్ను వాడిగా ఉండటంతో ఏడో రోజున పన్ను తొలగించామన్నారు.