విద్యార్థులను మంచి మార్గంలో నడిపించాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:31 AM
యుక్త వయసులో హార్మోన్ల మార్పులు, ఆందోళనల వల్ల విద్యార్థులు తప్పుదారిపట్టే ప్రమాదం ఉందని...
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): యుక్త వయసులో హార్మోన్ల మార్పులు, ఆందోళనల వల్ల విద్యార్థులు తప్పుదారిపట్టే ప్రమాదం ఉందని, వాటిని ముందుగానే పసిగట్టి వారిని మంచి మార్గంలో నడిపించాలని మెంటల్ హెల్త్ అండ్ కెరీర్ కౌన్సిలర్లకు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సూచించారు. కొత్తగా నియమితులైన కౌన్సిలర్లకు చేపట్టిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో ఆయన ప్రారంభించారు.