Share News

నూతన సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 20 , 2026 | 12:05 AM

వ్యవసాయ నూతన పద్ధతులపై అవ గాహన పెంచుకోవాలని డీఆర్‌డీఏ జి ల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమణారెడ్డి సూ చించారు.

నూతన సాగు పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్నరమణారెడ్డి

- డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమణారెడ్డి

ఆలూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ నూతన పద్ధతులపై అవ గాహన పెంచుకోవాలని డీఆర్‌డీఏ జి ల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమణారెడ్డి సూ చించారు. మంగళవారం పట్టణం లోని స్త్రీ శక్తి భవన్‌లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం (బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌)లకు సీహెచ్‌సీ సెంటర్‌, మార్కెటింగ్‌పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. మహిళా సంఘాలలో ఉన్న సభ్యులు వ్యవసాయ రంగంలో కూడా రాణించేవిధంగా మెళుకువలు నేర్చుకోవాలన్నారు. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీపీఎంలు నవీన్‌, నరసమ్మ, అశోక్‌, ఆలూరు ఏపీఎం అంజనయ్య, ఆస్పరి, హొళగుంద, హాలహర్వి, చిప్పగిరి, హొళగుంద మండలాలకు సంబంధించిన ఏపీఎంలు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 12:05 AM