Share News

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , Publish Date - May 17 , 2026 | 12:17 AM

చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారి జోత్స్నదేవి అన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

న్యాయాధికారి జోత్స్న దేవి

పత్తికొండ, మే 16 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారి జోత్స్నదేవి అన్నారు. శనివారం మండల పరిషత సమావేశ భవనంలో న్యాయా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అంగనవాడీలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. న్యాయాధికారి మాట్లాడుతూ బాలికలు లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు గురైనప్పుడు ఈ చట్టం వర్తిస్తుందన్నారు. బాధితులకు అండగా నిలుస్తూ వారిలో మానసిక ధైర్యాన్ని కల్పించాలన్నారు. పోక్సో చట్టం ఆధారంగా నేరం చేసిన వారికి శిక్షలు పడేలా చట్టం ఎలా రూపొందిందో బాధిత కుటుంబానికి తెలియజేసి ఆ దిశంగా మనం విధులు నిర్వహించాలని అన్నారు. కేవలం నేరం జరిగిన ప్రదేశాలలో కాకుండా గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీడీపీవో లలిత, అంగనవాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 12:18 AM