Minister Satya Kumar: సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవేర్ సేవలు..!
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:38 AM
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవడానికి రియల్...
సచివాలయాల వారీగా డేటా సేకరణ: ఆరోగ్యశాఖ
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీజనల్ వ్యాధులను రియల్ టైమ్‌లో పర్యవేక్షించి, వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవడానికి రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)లోని అవేర్ విభాగం సేవలను వినియోగించుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీజీఎస్ ‘అవేర్’ (అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఫర్ రిసిలియెంట్ ఎకోసిస్టమ్) ద్వారా రాష్ట్రంలో వ్యాధుల తీవ్రత, వ్యాప్తికి ఉన్న అవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించి వాటిని వెంటనే నివారించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ఐదారు సంవత్సరాల్లో గ్రామాలు, సచివాలయాల వారీగా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధుల కేసుల డేటాను విశ్లేషిస్తామని మంత్రి సత్యకుమార్ వివరించారు.