ప్రముఖులకు అవార్డులు ప్రదానం
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:36 AM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల ముగింపులో భాగంగా ఏడో రోజు మంగళవారం రాత్రి యోగీంధ్ర కళా మండపంలోప్రముఖ సినీనటుడు రిషబ్‌శెట్టి, చెన్నైకు చెందిన సెల్వి దామోదర్, హెచఎస్ రాఘవేంద్రరావు, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం సీఎన అశ్వత నారాయణ రాఘంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసి అవార్డును స్వీకరించారు.
మంత్రాలయం,ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల ముగింపులో భాగంగా ఏడో రోజు మంగళవారం రాత్రి యోగీంధ్ర కళా మండపంలోప్రముఖ సినీనటుడు రిషబ్‌శెట్టి, చెన్నైకు చెందిన సెల్వి దామోదర్, హెచఎస్ రాఘవేంద్రరావు, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం సీఎన అశ్వత నారాయణ రాఘంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలుచేసి అవార్డును స్వీకరించారు. అనంతరం యో గీంధ్ర కళామండపంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు జ్ఞాపిక, శేషవస్త్రం, ప్రశంసాపత్రం, వెండితట్ట, నగదు, ఫలపుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పండిత కేసరి రాజా ఎస్ గిరిరాజాచార్, ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషీ, సురేష్ కోణాపూర్, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తి, సీఐ రామాంజులు పాల్గొన్నారు. రాఘవేంద్రస్వామి మఠం విశిష్టతలను తెలిపే రాయర దర్శన అనే ఆల్బమ్ ట్రైలర్‌ను పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు, రిషబ్‌శెట్టి, జగ్గేష్ ఆవిష్కరించారు. లక్ష్మి గణేష్ ప్రొడక్షన ది న్యూ ఇండియా టైమ్స్ అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన ఆల్బమ్‌లోని పాటను తెరపై ఆవిష్కరించి ఆల్బమ్ సిబ్బందికి పీఠాధిపతి అభినందించారు.