Share News

‘ఓజీ’ చూపిస్తూ శస్త్రచికిత్స

ABN , Publish Date - Jun 06 , 2026 | 05:25 AM

మెదడు లోని కీలక భాగానికి సమీ పంలో ట్యూమర్‌ ఏర్పడిన మహిళకు... వైద్యులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ సినిమా చూపిస్తూ ...

‘ఓజీ’ చూపిస్తూ శస్త్రచికిత్స

  • మెదడుకు అరుదైన అవేక్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ

పొన్నూరు, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): మెదడు లోని కీలక భాగానికి సమీ పంలో ట్యూమర్‌ ఏర్పడిన మహిళకు... వైద్యులు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ సినిమా చూపిస్తూ రోగి స్పృహలో ఉండగానే అరు దైన ‘అవేక్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌ సర్జరీ’ నిర్వహించారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని డీవీసీ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వైద్యులు ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. కోటేశ్వరమ్మ అనే 45 ఏళ్ల మహిళ అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు డీవీసీ ఆస్పత్రిలో చేర్చించారు. పరీక్షల అనంతరం మెదడులోని కీలక భాగానికి సమీపంలో ట్యూమర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ట్యూమర్‌ ఉన్న ప్రదేశం శరీర కదిలికలు, మెదడు పనితీరును నియంత్రించే ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో నాడీ వ్యవస్థకు ఎలాంటి హాని కలుగకుండా ఉండేందుకు రోగి స్పృహలో ఉండగానే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయిం చారు. కోటేశ్వరమ్మ పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని కావడంతో ఆమెకు ఇష్టమైన ‘ఓజీ’ సినిమాను ల్యాప్‌టాప్‌లో ప్రదర్శిస్తూ ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమె సినిమా చూస్తూ వైద్యులతో నిరంతరం మాట్లాడుతూ వారి సూచనలు పాటించడంతో మెదడులోని సున్నితమైన భాగాలకు ఎటువంటి హాని కలగకుండా జాగ్రత్తగా ట్యూమర్‌ను తొలగించారు. ప్రముఖ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ పద్మనాబుని అరుణ్‌కుమార్‌ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించారు.

Updated Date - Jun 06 , 2026 | 05:25 AM