37 మందితో ఆవాజ్ రాష్ట్ర కమిటీ
ABN , Publish Date - May 11 , 2026 | 04:31 AM
నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టీ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఆవాజ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి.
10 తీర్మానాల ఆమోదం.. ముగిసిన రాష్ట్ర మహాసభలు
నెల్లూరు (వైద్యం) మే 10 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగరంలోని డాక్టర్ జెట్టీ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న ఆవాజ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా 10 తీర్మానాలను సభ ఆమోదించింది. వక్భ్‌బోర్డు భూములు అన్యాక్రాంత కాకుండా చూడాలని, అసంపూర్తిగా ఉన్న షాదీమంజిల్‌లను పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని, దేశవ్యాప్తంగా మత విద్వేషాలు, మతోన్మాద చర్యలను ఖండిస్తూ కమిటీ తీర్మానం చేసింది. అలాగే కూటమి ప్రభుత్వం అమోదించిన సూపర్‌సిక్స్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గంజాయి మత్తుపదార్ధాలు, మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో నివారించాని, దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో ముస్లిం ఓట్ల తొలగింపును వ్యతిరేకించాలని తీర్మానించారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతుగా నిలుద్దామని, మహిళ రిజర్వేషన్‌లో డీ లిమిటేషన్‌తో ముడిపెట్టకుండా అమలు చేయాలని, మైనార్టీలకు స్కాలర్‌షి్‌పలు కేంద్రం పునరుద్ధ్దరించాలని, సబ్‌ప్లాన్ అమలు చేయాలని నేతలు తీర్మానించారు. అనంతరం 37 మందితో ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఎన్నికయింది. రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా ఎంఏ. గఫూర్.., రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంఏ సుభాన్, చిష్టి, కోశాధికారిగా షేక్ రషీద్, సహాయ కార్యదర్శులుగా షరీఫ్, షేక్ బాషా ఎన్నికయ్యారు. కాగా, మత సామరస్యం వర్ధిల్లాలంటూ సీపీఎం, ఆవాజ్ నేతలు ఆదివారం నగరంలోని డాక్టర్ జెట్టీ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నుంచి చిల్డ్రన్స్ పార్కు వరకు ప్రదర్శన నిర్వహించారు.