Agriculture Minister Achchennaidu: స్మార్ట్ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన రైతుకు లాభం
ABN , Publish Date - Jan 07 , 2026 | 03:04 AM
వాతావరణ మార్పులు, నీటి వనరుల తగ్గుదల, సాగు ఖర్చుల పెరుగుదల వంటి సవాళ్లను అధిగమించి, సుస్థిర వ్యవసాయానికి సాంకేతికతను రైతులు విరివిగా వినియోగించాలని వ్యవసాయ....
ఆటోమేషన్‌ను ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
అమరావతి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వాతావరణ మార్పులు, నీటి వనరుల తగ్గుదల, సాగు ఖర్చుల పెరుగుదల వంటి సవాళ్లను అధిగమించి, సుస్థిర వ్యవసాయానికి సాంకేతికతను రైతులు విరివిగా వినియోగించాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మంగళవారం విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మైక్రో ఇరిగేషన్‌లో ఆటోమేషన్ విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘‘ఉద్యాన పంటలకు వాడే మైక్రో ఇరిగేషన్‌లో ఆటోమేషన్ గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పటికే ఉన్న డ్రిప్ ఇరిగేషన్‌కు ఆటోమేషన్ అమర్చుకుంటే.. 20-30ు నీరు ఆదా కావడంతో పాటు కూలీల ఖర్చు, విద్యుత్ వినియోగం తగ్గుతుంది. పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుంది’’ అని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏపీఎంఐపీ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.