Share News

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:34 PM

మైనర్‌ బాలికపై అత్యాచా రయత్నం ఘటన బనగానపల్లెలోని సీఎంఆర్‌ ఫంక్షన హాల్‌ సమీ పంలో చోటుచేసుకున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం

పోక్సో కేసు నమోదు

బనగానపల్లె, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): మైనర్‌ బాలికపై అత్యాచా రయత్నం ఘటన బనగానపల్లెలోని సీఎంఆర్‌ ఫంక్షన హాల్‌ సమీ పంలో చోటుచేసుకున్నట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. వివరాలు.. కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లెకు చెందిన రవితేజ అనే 19ఏళ్ల యువకుడు తన కుటుంబంతో సహా బనగానపల్లెలోని కొం డపేటలో నివసిస్తున్నాడు. అతడు గౌండా పనులు చేసు కుంటూ మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతుండే వాడు. శుక్రవారం మధ్యాహ్నం 1గంట సమయంలో ఓ మైనర్‌ బాలిక నడుచు కుంటూ వెళ్తుండగా అదేమార్గంలో నడుచుకుంటూ వస్తున్న రవితేజ ఆమెకు మాయమాటలు చెప్పి సీఎంఆర్‌ ఫంక్షనహాల్‌ సమీపంలోని బ్రిడ్జి కిందికి తీసుకుపోయాడు. అత్యాచారయత్నానికి పాల్పడగా బాలిక కేక లు వేసింది. సమీపంలోని ప్రజలు అక్కడికి వచ్చి మద్యం మత్తులో ఉన్న రవితేజకు దేహశుద్ధి చేశారు. అతడిని పోలీసులకు అప్పగిం చారు. గాయపడ్డ బాలికను ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు అత్యాచా రయత్నం, పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 11:34 PM