మీడియాపై దాడులు వైసీపీ నైజం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:00 AM
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకల దాడి హేయమైన చర్యగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు.
టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి
ఆలూరు, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ అల్లరి మూకల దాడి హేయమైన చర్యగా ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రసారమైతే అందుకు వార్తను ఖండించే అవకాశం ఉందని, కోర్టుకు వెళ్లవచ్చన్నారు. మీడి యా సంస్థను నడుపుతున్న జగన్ ఇలా మీడియాపై దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమన్నారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు ఇలా మాజీ మంత్రుల చేత దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. దీన్ని బట్టి వైసీపీ నైజం మరోసారి బయట పడిందన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ వెంట జనం ఉన్నారని, ఇలాంటి తాటాకు శబ్దాలకు ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ భయపడరన్నారు.