Share News

48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:27 PM

నేమకల్‌ ఘర్షణ ఘటనలో 48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు నమోదు అయింది.

48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు

ఆలూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): నేమకల్‌ ఘర్షణ ఘటనలో 48 మంది వైసీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసులు నమోదు అయింది. చిప్పగిరి మండలం నేమకల్‌, సంగాల గ్రామాల్లో ఈనెల 1న వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో టీడీపీ కార్యకర్త నాగరాజు భార్య సుచిత్ర తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చిప్పగిరి పోలీసులు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌, సోదరుడు శ్రీరాములతో పాటు 45 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య విచారణ జరిపారు. మంగళవారం ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న సురేష్‌రెడ్డి, ఉమ్మన్న గారి మల్లికార్జున, తోప్సి గోపి, తోప్సి వీరేష్‌, తోప్సి వినోద్‌కుమార్‌, కోటేష్‌ కుమార్‌, తోప్సి దివాకర్‌, తోప్సి సుధాకర్‌, గొల్ల మోహన్‌, డి.సుంకన్నలను అరెస్టు చేసి ఆలూరు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్‌కు ఆదేశించారు. వీరందరినీ ఆదోని సబ్‌జైలుకు తరలించినట్లు ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Aug 11 , 2026 | 11:27 PM