Share News

అనారోగ్యంతో అమ్మ... తల్లికి ఏమవుతుందో అని తనయుడు....

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:22 AM

కన్నతల్లి కడుపు నొప్పితో బాధపడుతూ, ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. తల్లి అనారోగ్యం విషయమై మనోవ్యధకు గురైన తనయుడు గుండెపోటుతో మృతి చెందాడు.

అనారోగ్యంతో అమ్మ... తల్లికి ఏమవుతుందో అని తనయుడు....

  • నిమిషాల వ్యవధిలో ఇద్దరూ మృతి

ఆత్రేయపురం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కన్నతల్లి కడుపు నొప్పితో బాధపడుతూ, ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది. తల్లి అనారోగ్యం విషయమై మనోవ్యధకు గురైన తనయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన చిట్టూరి అపర్ణ (46) అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఆమెకు కడుపునొప్పి రావడంతో కుమారుడు సతీశ్‌ గుప్తా అమ్మమ్మను తోడిచ్చి ఆటోలో రావులపాలెం ప్రైవేట్‌ ఆసుపత్రికి పంపించాడు. కడుపునొప్పి ఎక్కువై మార్గమధ్యలోనే అపర్ణ మృతిచెందారు. మరోవైపు.. తల్లి అనారోగ్యం విషయమై మనోవ్యధతో ఉన్న సతీశ్‌ గుప్తా (20) ఆమెను ఆసుపత్రికి పంపిన కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు. సతీశ్‌ బీటెక్‌ ప్రఽథమ సంవత్సరం చదువుతున్నాడు. అతని తండ్రి చిట్టూరి వీరభద్రం కరోనా సమయంలో మృతి చెందారు.

Updated Date - Jul 11 , 2026 | 05:23 AM