Share News

10లక్షల సాయాన్ని ముష్టి అంటావా?

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:01 AM

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం సహాయం చేస్తే.. జగన్‌రెడ్డి ఆ సాయాన్ని ముష్ఠితో పోల్చడం దుర్మార్గమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

10లక్షల సాయాన్ని ముష్టి అంటావా?

  • మత్స్యకారులకు ఎవరేం చేశారో చర్చిద్దాం

  • ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా

  • జగన్‌కు మంత్రి అచ్చెన్న సవాల్‌

  • మీ హయాంలో 277 మంది చనిపోయారు

  • ఒక్కర్నీ పరామర్శించలేదు.. పరిహారమూ ఇవ్వలేదు

  • జగన్‌ వ్యాఖ్యలపై ఫైర్‌

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం సహాయం చేస్తే.. జగన్‌రెడ్డి ఆ సాయాన్ని ముష్ఠితో పోల్చడం దుర్మార్గమని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 277 మంది మత్స్యకారులు చనిపోతే.. ఒక్క కుటుంబాన్నీ పరామర్శించని జగన్‌.. ప్రమాదవశాత్తు గల్లంతైన మత్స్యకారుల కు టుంబాలను బాధ్యత గల ప్రభుత్వంగా ఆదుకుం టే.. ముష్టి అని మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం లో అచ్చెన్న మీడియాతో మాట్లాడారు. వైసీపీ మా జీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు వాహనం ఢీకొని పేద గొర్రెల కాపరి దానయ్య చనిపోతే.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా.. నిస్సిగ్గుగా రాజకీయ విమర్శలు చేస్తున్న జగన్‌రెడ్డిని జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ‘ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే.. కళ్లకు కేటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్నందున సహచర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, కుటుంబ సభ్యుల దగ్గరికి పంపాం. పోర్టు దగ్గరకు పంపా. హోం మంత్రి స్పందించారు. సీఎం చంద్రబాబు తక్షణం స్పందిం చి, మత్స్యకారులను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఏ ప్రాంతంలో బోటు మునిగిందో తెలియని స్థితిలో ఆరుగురిని కాపాడుకోలేకపో యాం. కానీ అచ్చెన్నాయుడు రాలేదని నిస్సిగ్గుగా విమర్శిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో 277 మంది చనిపోతే ఒక్కర్నీ జగన్‌ పలకరించలేదు. కనీసం పరిహారం ఇవ్వలేదు.


జగన్‌ హయాంలో చనిపోయిన వాళ్లకి కూడా సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు ఏడాదికి రూ.10 వేలు చొ ప్పున వేట నిషేధ భృతి కింద రూ.530 కోట్లు ఇవ్వడం తప్ప.. జగన్‌ మత్స్యకారులకు ఇంకేమీ ఇవ్వలేదు. డీజిల్‌ సబ్సి డీ బకాయిలు పెట్టారు. వల కుట్టుకోవటానికి దారం కూడా ఇవ్వలేదు. బోటు పాడైతే బోటు ఇవ్వలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరినైనా పలకరించకుం డా, ప్రతిపక్షంలో ఉండి రాజకీయాలు చేస్తావా? చాలెంజ్‌ చేస్తున్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. నువ్వు.. నేనూ కూర్చుం దాం. లేదా ఫోన్‌లో ఆన్‌లైన్‌ మీటింగ్‌ పెట్టు.. మ త్స్యకారులకు ఎవరేం చేశారో చర్చిద్దాం’ అని అచ్చెన్న సవాల్‌ చేశారు.


అప్పలరాజే ప్రథమ ముద్దాయి

‘మీ మాజీ మంత్రి కొడుకు బైక్‌తో గుద్దిన వ్యక్తిని వెంటనే దగ్గరలోని హాస్పటల్‌లో చేర్చితే దానయ్య బతికేవాడే కదా? గాయపడినవాడిని రక్షించకపోగా, తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. ప్రమాదాలు కావాలని చేయ రు. మంత్రిగా వెలగబెట్టినవాడు ఏం చేయాలి. తప్పు జరిగిందని కాబట్టి చట్ట ప్రకారం నడవాలి. కొడుకును రక్షించుకోటానికి అమాయకుడిని ము ద్దాయిగా చూపుతారా? ఈ కేసులో కొడుకు కంటే తండ్రే ప్రథమ ముద్దా యి. ఇలాంటి దొంగలు ఉంటారనే, గొ డ్డలి పార్టీ ఉందనే చంద్రబాబు రాష్ట్రమంతా సీసీ కెమేరాలు పెట్టారు. చేసినవి చెప్పుకోవడం మా ధర్మం. 2014-19లో సమాధానాలు చెప్పక నష్టపోయాం. ఈసారి నీకు ఆ చాన్స్‌ ఇవ్వం. ప్రతి దానికి వాస్తవాలు చెప్తాం. చట్టం, న్యా యం అందరికీ ఒక్కటే. అన్నీ డేగ కళ్లుతో చూస్తారు. సీసీ కెమేరాలు లేకపోతే.. కక్ష సాధింపు చర్య అనేవాడు. నీ బండారం అంతా బయటపడింది. ఈరోజు నీకు ఈ స్వేచ్ఛ ఎందుకిచ్చామంటే.. ప్రజాస్వామ్యా న్ని గౌరవించాలనే’ అని అచ్చెన్న అన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 05:03 AM