బూతుల నేతలను దండించకుండా పరామర్శ పేరుతో డ్రామాలా..: అచ్చెన్న
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:22 AM
బూతులు మాట్లాడే నేతలను దండించాల్సింది పోయి, వారిని పరామర్శించే పేరుతో జగన్ డ్రామాలు ఆడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): బూతులు మాట్లాడే నేతలను దండించాల్సింది పోయి, వారిని పరామర్శించే పేరుతో జగన్ డ్రామాలు ఆడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 30 నిమిషాలు పట్టే 34 కిలోమీటర్లకు 9 గంటల ప్రయాణాన్ని సాగించింది కేవలం మునిగిపోత్ను వైసీపీ నావను కాపాడుకోవడానికేనని అన్నారు. జగన్ జంగిల్‌రాజ్ పాలనను చూసే ప్రజలు ఆయన్ను 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. అయినా తన తీరును మార్చుకోకుండా వైసీపీ నాయకులను రెచ్చగొట్టేలా జగన్ యాత్ర సాగిందన్నారు. చట్టాలంటే లెక్కలేని ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరమని అన్నారు.