అటల్ గౌరవార్థం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:09 AM
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గౌరవార్థం దేశవ్యాప్తంగా స్మారకోపన్యాసాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి...
వాజపేయి పాలనాదక్షతను తెలియజేసేందుకే: వెంకయ్య
న్యూఢిల్లీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి గౌరవార్థం దేశవ్యాప్తంగా స్మారకోపన్యాసాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మాజీ ఉపరాష్ట్రపతి, అటల్ స్మృతి న్యాస్ సొసైటీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. గురువారం ఢిల్లీలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్‌రెడ్డి, వాజపేయి మంత్రివర్గంలో పనిచేసిన రాజీవ్ ప్రతాప్ రూఢీ, ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, షానవాజ్ హుస్సేన్, వాజపేయి మాజీ మీడియా సలహాదారు అశోక్ టాండన్ తదితరులతో చర్చించారు. వాజపేయి నాయకత్వం, పాలనాదక్షత, రాజనీతిజ్ఞత గురించి ప్రజలకు తెలియసేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్టు వెంకయ్య తెలిపారు.