ఆటా సభలు.. మేరీల్యాండ్ గవర్నర్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Mar 14 , 2026 | 06:19 AM
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో జరిగే 19వ అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు.
(డల్లాస్ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)
మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో జరిగే 19వ అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలకు మేరీల్యాండ్ రాష్ట్ర గవర్నర్ వెస్ మూర్‌ను ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ ఆహ్వానించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయస్థాయి తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా జయంత్ గవర్నర్‌కు తెలిపారు. 15వేల మందికిపైగా ఈ వేడుకకు హాజరవుతారని అన్నారు. మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్‌ను కూడా కలిసి సభలకు ఆహ్వానించారు. ఇరువురూ సానుకూలంగా స్పందించారని ఆటా ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో సభల కన్వీనర్ బానాల శ్రీధర్, ట్రస్టీలు మట్టపల్లి రామ్, కో కోఆర్డినేటర్ జీనత్ కుందూర్ తదితరులు పాల్గొన్నారు.