Share News

మాకు న్యాయం చేయండి

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:38 AM

గత తెలుగుదేశం ప్రభుత్వంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ...

మాకు న్యాయం చేయండి

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): గత తెలుగుదేశం ప్రభుత్వంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఏపీపీఎస్సీ నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఆమేరకు వారు బుధవారం మంగళగిరిలోని ఉన్నత విద్య కమిషనరేట్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు, వీసీలకు వినతిపత్రాలు అందజేశారు. ఒకే జీవో ద్వారా జారీ చేసిన పోస్టుల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులకు ఒక న్యాయం, ప్రొఫెసర్‌ అభ్యర్థులకు మరొక న్యాయం అమలు చేయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. నోటిఫికేషన్‌ జారీ నాటికి ఉన్న నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 03:38 AM