Share News

గంజాయి కేసులో ఆస్తులు జప్తు

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:57 AM

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో గతేడాది గంజాయి రవాణా, విక్రయించిన కేసుకు సంబంధించి భార్యాభర్తల ఆస్తులను జప్తు చేయాలని..

గంజాయి కేసులో ఆస్తులు జప్తు

రాజానగరం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో గతేడాది గంజాయి రవాణా, విక్రయించిన కేసుకు సంబంధించి భార్యాభర్తల ఆస్తులను జప్తు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ శనివారం పేర్కొన్నారు. కొండగుంటూరులో రఘువీరాయ్‌, ప్రశాంత్‌రాయ్‌ దంపతులు కొబ్బరికాయల విక్రయాలు మాటున గంజాయి రవాణా, విక్రయాలు సాగిస్తున్నట్టు సమాచారం అందడంతో గతేడాది జూన్‌ 14న దాడి చేసి, 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులకు గ్రామంలో ఉన్న భవనంతో పాటు ప్లాట్లను సీజ్‌ చేయనున్నట్టు సీఐ చెప్పారు.

Updated Date - Jul 05 , 2026 | 04:58 AM