Share News

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీల రాజీనామాలు పెండింగ్‌: పర్చూరి అశోక్‌బాబు

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:20 AM

వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా ఏడాది కాలం పాటు పెండింగ్‌లో ఉంచడం వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరేదీ లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు పరుచూరి అశోక్‌ బాబు అన్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీల రాజీనామాలు పెండింగ్‌: పర్చూరి అశోక్‌బాబు

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా ఏడాది కాలం పాటు పెండింగ్‌లో ఉంచడం వెనుక రాజకీయ దురుద్దేశం తప్ప మరేదీ లేదని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు పరుచూరి అశోక్‌ బాబు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్సీల రాజీనామాలను ఆమోదించకుండా పెండింగ్‌లో ఉంచారు. రాజీనామా లేఖ నిర్ణీత ఫార్మాట్‌లో ఉంటే ఆమోదించకుండా తిరస్కరించడం చట్టవిరుద్ధం. పార్టీ కంటే స్పీకర్‌ ధర్మం గొప్పదని చాటిన సోమనాథ్‌ ఛటర్జీని చూసి మోషేన్‌ రాజు నేర్చుకోవాలి’ అని అశోక్‌బాబు అన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 05:20 AM