Share News

పంచ్‌ ప్రభాకర్‌పై పోలీసులకు ఆర్యవైశ్యుల ఫిర్యాదు

ABN , Publish Date - May 31 , 2026 | 05:56 AM

సోషల్‌ మీడియా వేదిక ద్వారా ఆర్యవైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చినిపల్లి ప్రభాకర్‌రెడ్డి అలియాస్‌ పంచ్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు

పంచ్‌ ప్రభాకర్‌పై పోలీసులకు ఆర్యవైశ్యుల ఫిర్యాదు

కందుకూరు, మే 30(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వేదిక ద్వారా ఆర్యవైశ్య సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న చినిపల్లి ప్రభాకర్‌రెడ్డి అలియాస్‌ పంచ్‌ ప్రభాకర్‌పై కేసు నమోదు చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ప్రకాశం జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోదడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ‘పంచ్‌ ప్రభాకర్‌ వాట్సాప్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రాం లాంటి వేదికల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్‌ చేస్తున్నాడు. దీనికోసం అనేక మంది వ్యక్తుల ఐడీలు ఉపయోగించుకుంటున్నాడు. అసత్య ప్రచారంతో మా కుల ప్రతిష్ఠను, ఆర్యవైశ్య పెద్దల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు. పంచ్‌ ప్రభాకర్‌, మరికొంతమంది కుట్రదారులు సమన్వయంతో ఈ దురాగతానికి పాల్పడుతున్నారు’ అని మండిపడ్డారు.

Updated Date - May 31 , 2026 | 05:56 AM