Share News

ఆదోని ఆర్డీవోగా అరుణదేవి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:23 PM

ఆదోని రెవెన్యూ డివిజన్‌ నూతన అధికారిగా (ఆర్డీఓ) కె.అరుణదేవి బాధ్యతలు చేపట్టారు.

ఆదోని ఆర్డీవోగా అరుణదేవి బాధ్యతల స్వీకరణ
కార్యాలయంలో పూజలు చేస్తున్న ఆర్డీవో అరుణాదేవి

ఆదోని, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆదోని రెవెన్యూ డివిజన్‌ నూతన అధికారిగా (ఆర్డీఓ) కె.అరుణదేవి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆమెకు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్డీ అరుణాదేవి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు సామాన్య ప్రజలకు పారదర్శకంగా సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి నవీన్‌కుమార్‌, తహసీల్దార్‌ శేషఫణి, రజనీకాంత్‌రెడ్డి, వలీబాషా, రెవెన్యూశాఖ సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుంటున్న ఆర్‌డీవో

ఆదోని అగ్రికల్చర్‌ : ఆదోని ఆర్‌డీవోగా బాధ్యతలు చేపట్టిన అరుణాదేవి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మహాయోగి లక్ష్మమ్మను దర్శించుకున్నారు. ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ధర్మకర్త రాచోటి రామయ్య, రాయచోటి సుబ్బమ్మ ఆర్‌డీవోను సత్కరించారు. భక్తులకు ఉచిత ప్రసాదం ఆమె చేతుల మీదుగా వితరణ చేయించారు. డిప్యూటీ తహసీల్దారు బాబు, వీఆర్‌వో చిన్న ఈరన్న, రాజశేఖర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

ఆర్టీవోను కలిసి ‘ఉరుకుంద’ పాలకమండలి సభ్యులు

ఉరుకుంద ఈరన్న పుణ్యక్షేత్రం పాలకమండలి చైర్మన పాండురంగయ్య శెట్టి సభ్యులు చిన్న రంగస్వామి రవికుమార్‌ దేవస్థానం కమిషనర్‌ వాణి, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర్లు, ప్రధాన అర్చకులు శుక్రవారం ఆర్‌డీవో కార్యాలయంలో ఆర్‌డీవో అరుణాదేవిని కలిసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఉరుకుండ క్షేత్రంలో జరిగే పలు కార్యక్రమాల గురించి వివరించారు.

Updated Date - Jul 10 , 2026 | 11:23 PM