కెమెరా కళ్లజోడుతో అరుణాచలేశ్వరాలయ ప్రవేశం
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:28 AM
పంచభూత లింగ ఆలయాల్లో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోకి అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడుతో ప్రవేశించిన..
పోలీసుల అదుపులో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు
వేలూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పంచభూత లింగ ఆలయాల్లో అగ్ని క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోకి అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడుతో ప్రవేశించిన తెలంగాణకు చెందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆలయం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లపైనా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తెలంగాణకు చెందిన పవనేశ్, మహేశ్ అత్యాధునిక కెమెరా ఉన్న కళ్లజోడు పెట్టుకుని ఆలయ క్యూలైన్లో నిల్చున్నారు. వారి వ్యవహారశైలిని అనుమానించిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కళ్లజోడులో కెమెరా ఉన్నట్టు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.