బోధనాస్పత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:18 AM
రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖల్లో ఏర్పాటు
అమరావతి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లోనే జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాసిన లేఖ మేరకు ఈ తయారీ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. తొలి విడతలో భాగంగా ఒంగోలు, తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖల్లోని సర్వజన ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారని వెల్లడించారు. వీటి నిర్మాణానికి అవసరమైన స్థలాలు, ఇతర వసతుల పరిశీలనను కేంద్ర బృందాలు సోమవారం ప్రారంభించాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు.