వైసీపీ నాయకుల అరెస్టు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:52 PM
ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనధికారికంగా నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారని ఎంపీడీవో జి. వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం 14 మంది వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు.
అనధికారికంగా ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం చట్ట విరుద్ధం
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు
డీఎస్పీ శ్రీనివాస్
డోన టౌన, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనధికారికంగా నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని వైసీపీ నేతలు ప్రారంభించారని ఎంపీడీవో జి. వెంకటేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం 14 మంది వైసీపీ నాయకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పి. శ్రీనివాస్ తెలిపారు. సోమవారం స్థానిక అర్బన సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు టోల్‌ప్లాజా సమీపంలో 14 మంది వైసీపీ నాయకులను అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో వైసీపీ నాయకులు ఏ1గా రేగటి రాజశేఖర్ రెడ్డి, ఏ3 బద్దల రాజ్‌కుమార్ యాదవ్‌లతో పాటు మల్లికార్జున రెడ్డి, పోస్టు ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, మల్లెంపల్లె తలారి రామచంద్రుడు, గొల్ల సుధాకర్ యాదవ్, అరవ ఎర్రిస్వామి, రేగటి రామేశ్వరరెడ్డి, పూజారి వంశీకృష్ణ, షేక్ మహ్మద్ జాకీర్ హుశేన, పిక్కిలి పెద్ద ఓబులేసు, గొల్ల సోమేష్ యాదవ్, సయ్యద్ మన్సూర్‌లను అరెస్టు చేశారు. అలాగే ఏ2 జడ్పీ చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డిని అరెస్టు చేయలేదన్నారు. 30 యాక్టు అమలులో ఉందని, అనధికారికంగా కార్యక్రమాలు, ర్యాలీలు, నిర్వహించరాదన్నారు. అధికారులకు, సంబంధిత ఎమ్మెల్యేకు తెలియకుండా రహస్యంగా ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించడం చట్టవిరుద్ధమన్నారు. అరెస్టు చేసిన వారిని వైద్యపరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, రూరల్ సీఐ సీఎం రాకేష్, ఎస్‌ఐలు మమత, నాగరాజు, ఏఎస్‌ఐ వెంకటరమణ, భాస్కర్, పోలీసులు శివరంగయ్య, చెంచన్న, సుధాకర్, మద్దిలేటి ఉన్నారు.