Share News

నిందితుల అరెస్టు

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:49 PM

డోన పట్టణానికి చెందిన బోరిల్ల విల్సన హత్యకు భార్య రాిశి ఆలియాస్‌ మేరీ కారణమని పోలీసులు విచారణలో తేలింది.

   నిందితుల అరెస్టు
నిందితులను అరెస్టు చూపుతున్న బనగానపల్లె సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ భూపాలుడు

మృతుడు డోనకు చెందిన విల్సన

ప్రియుడితో కలిసి హత్య చేయించిన భార్య

బనగానపల్లె, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): డోన పట్టణానికి చెందిన బోరిల్ల విల్సన హత్యకు భార్య రాిశి ఆలియాస్‌ మేరీ కారణమని పోలీసులు విచారణలో తేలింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని, నిందితులను అరెస్టు చేశామని ్ల బనగానపల్లె సీఐ మంజునాథరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బనగానపల్లె మండలం కైప గ్రామ సమీపంలోని పొలాల్లో డోనకు చెందిన విల్సన ఈ నెల 16న హత్యకు గురయ్యాడు. మొదట వివరాలు తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి కేసుగా నమోదు చేసుకున్నారు. విచారణలో మృతుడు బోరిల్ల విల్సన అని, ప్రస్తుతం నంద్యాల బొగ్గులైనలో భార్య రాశితో కలిసి జీవిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రాంతానికి చెందిన మధుతో రాశి అలియాస్‌ మేరి వివాహేతర సంబంధం పెట్టుకొని, అతని సహాయంతో భర్తను హతమార్చినట్లు విచారణలో తెలిసినట్లు పోలీసులు వివరించారు. విల్సనకు, నంద్యాలకు చెందిన సమీప బంధువు రాశితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. విల్సన తాగుడుకు బానిస అయి భర్యను నిత్యం వేధించేవాడు. విల్సన భార్యతో గొడవ పడి స్వగ్రామం డోనకు వెళ్లి పోయారు. దీంతో మధు, అతని స్నేహితులు అశోక్‌, మహమ్మద్‌ రఫీ డోనకు వెళ్లి విల్సనను నమ్మించి ఆటోలో నంద్యాలకు తీసుకు వెళ్తూ మార్గమధ్యంలో బనగానపల్లె మండలం కైప గ్రామం వద్ద పొలాఓ్ల మద్యం బాగా తాపించి బెల్టుతో మెడకు బిగించి హత్య చేశారు. అనంతరం ముఖం కనిపించకుండా బండరాళ్లతో కొట్టారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించాక రాశి, మధు, మహమ్మద్‌ రఫి, అశోక్‌ కైప వీఆర్‌వో ఎదుట లొంగిపోయారు. వీరిని వీఆర్‌వో బనగానపల్లె పోలీ్‌సస్టేషనకు అప్పగించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ దంపతులకు నిహారిక, ప్రణీత అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Updated Date - Mar 25 , 2026 | 11:49 PM