పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:16 PM
ఈనెల 9న సీఎం కొత్తబురుజుకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశరెడ్డి
హెలిప్యాడ్, సభా స్థలం పరిశీలన
డోన టౌన, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఈనెల 9న సీఎం కొత్తబురుజుకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సభా స్థలాన్ని, హెలిప్యాడ్ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు వేగవంతంగా చేయాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యాలు, రవాణా, భద్రత, వేదిక నిర్వహణ వంటి అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సభా వేధిక నిర్మాణం, హెలిప్యాడ్ స్థల ఎంపిక, రూట్ మ్యాప్, పార్కింగ్ సదుపాయాలు, తాగునీరు, విద్యుత, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.