నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఎంవోయూ
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:34 AM
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు నిమిత్తం ఏఎం/ఎన్‌ఎస్ (ఇండియా) సంస్థ రాష్ట్రప్రభుత్వంతో రెండు ఒప్పందాలు చేసుకుంది.
నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు నిమిత్తం ఏఎం/ఎన్‌ఎస్ (ఇండియా) సంస్థ రాష్ట్రప్రభుత్వంతో రెండు ఒప్పందాలు చేసుకుంది. సోమవారం స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు, కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమక్షంలో ఆ సంస్థ ఈ ఎంవోయూలు చేసుకుంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఒకటి, ఆధునిక ఉత్పత్తి సామర్థ్యాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసేలా మరో ఎంవోయూ చేసుకుంది. అత్యాధునిక మెటలార్జికల్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా యువతకు మెరుగైన నైపుణ్యం, తయారీ సామర్థ్యాలను కల్పించడం ఈ ఏంవోయూల ముఖ్య ఉద్దేశం.