Share News

అరసం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - May 25 , 2026 | 04:57 AM

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం రాష్ట్ర 20వ మహాసభలు తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగాయి.

అరసం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 24 (ఆంధ్రజ్యోతి): అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నికైంది. సంఘం రాష్ట్ర 20వ మహాసభలు తిరుపతిలో రెండు రోజుల పాటు జరిగాయి. ఆదివారం జరిగిన ముగింపు సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా డాక్టర్‌ పి.సంజీవమ్మ (కడప), అధ్యక్షుడుగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి (అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా వల్లూరు శివప్రసాద్‌ (గుంటూరు)ను ఎన్నుకున్నారు. అధ్యక్షవర్గ సభ్యులుగా సాకం నాగరాజ (తిరుపతి), ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి (కడప), నల్లి ధర్మారావు (శ్రీకాకుళం), సీహెచ్‌ సుశీలమ్మ (గుంటూరు), అడబాల లక్ష్మి (ఏలూరు), అల్లంశెట్టి ఈశ్వరమ్మ (విశాఖ), పి.సుబ్బరాజు (కాకినాడ), పెరుగు రామకృష్ణ (నెల్లూరు), కార్యనిర్వాహక కార్యదర్శిగా జీఎస్‌ చలం (విజయనగరం) ఎన్నికయ్యారు. కార్యదర్శివర్గ సభ్యులుగా 10మంది, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా 32మందిని ఎన్నుకున్నారు. సమాచార సేకరణ కన్వీనర్లుగా యువశ్రీ మురళి (తిరుపతి), సోషల్‌ మీడియా సబ్‌ కమిటీ కన్వీనర్‌గా ఏఎంఆర్‌ ఆనంద్‌, సభ్యులుగా సురేష్ బాబు (కడప), బస్సు పోతన (విశాఖ)ను ఎన్నుకున్నట్టు అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రకటించారు. జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణ పర్యవేక్షణలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు.

తీర్మానాలిలా..

  • ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ స్థాపించాలి.

  • తెలుగును బోధన,పాలన భాషగా అమలు చేయాలి.

  • గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలి.

  • అధిక ధరలను తగ్గించి పేదరికం, నిరుద్యోగంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

Updated Date - May 25 , 2026 | 04:58 AM