Share News

4 కాదు.. రూ.2లే తగ్గిస్తాం!

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:19 AM

ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, దాణా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్యేమార్గం తాత్కాలిక పరిష్కారం చూపారు! రొయ్య దాణా ధరను కిలోకు రూ.4 తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు!!

4 కాదు.. రూ.2లే తగ్గిస్తాం!

  • రొయ్య మేత ధరలపై కంపెనీల తీరు

  • సీఎం సూచనలూ పట్టని వైనం

  • అమలే చేయని కొన్ని కంపెనీలు

మండవల్లి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, దాణా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్యేమార్గం తాత్కాలిక పరిష్కారం చూపారు! రొయ్య దాణా ధరను కిలోకు రూ.4 తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు!! అయితే దాణా తయారీ కంపెనీలు సీఎం చెప్పిన దానికి అనుగుణంగా ధరల తగ్గింపును పాటించడం లేదు. రాష్ట్రంలో కొన్నిచోట్ల కొన్ని కంపెనీలు అసలు ధరల తగ్గింపును అమలు చేయకపోగా.. మరికొన్ని కంపెనీలు కిలోకు రూ.4 కాకుండా రూ.2-2.30 పైసలు మాత్రమే తగ్గించడంతో ముఖ్యమంత్రి మాటను సైతం లెక్కచేయనట్లు అయింది. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ రొయ్యల మేతల ధరల పెంపు రైతులపై మరింత భారం మోపింది. మేత తయారీ కంపెనీలు కేజీకి రూ.10 చొప్పున ధరలు పెంచడంతో ఆందోళన నెలకొంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆక్వా రైతు ప్రతినిధులు, దాణా తయారీ సంస్థల ప్రతినిధులు, మత్స్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ధరపై కిలోకు రూ.4 తగ్గించేలా ఒప్పించారు. ఫలితంగా దాణా ధరను కిలో రూ.112 నుంచి రూ.108కి తగ్గించాలి. కానీ, కంపెనీలు సీఎం సూచనలను పూర్తిగా అమలు చేయడం లేదు. ఎమ్మార్పీపై తగ్గించకుండా ఇన్‌వాయి్‌సపై కేజీకి రూ.2.30 మాత్రమే తగ్గించాయి. కంపెనీలు శుక్రవారం ఈ నిర్ణయాన్ని మేత సరఫరా డీలర్లకు తెలియజేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని రొయ్యల మేత మార్కెట్లో 10 ప్రధాన కంపెనీలు 80-90 శాతం వరకు వ్యాపారాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ కంపెనీల ఆధిపత్యం కారణంగా ధరల నిర్ణయం కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతమైంది.


సీఎం ఆదేశాల మేరకు తగ్గించాలి..

ఆక్వా రంగాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. రైతుల మొర ఆలకించిన ముఖ్యమంత్రి చం ద్రబాబు రొయ్యల మేతల కంపెనీ యజమానులను రూ.4 ధర తగ్గించాలని సూచించినా... కంపెనీలు రూ.2.30 మాత్రమే తగ్గించడం దారుణం. ప్రభు త్వం మరోసారి జోక్యం చేసుకుని రూ.4 ధర తగ్గేలా చర్యలు తీసుకోవాలి.

- ముదునూరి హరివర్మ, ఆక్వా రైతు,

భుజబలపట్నం, కైకలూరు మండలం

Updated Date - Jun 20 , 2026 | 04:20 AM