పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్ చేయాలి:ఏపీటీఎఫ్
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:29 AM
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా మార్చాలని ఏపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.
అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం పంచాయతీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ క్యాడర్‌గా మార్చాలని ఏపీటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల అధ్యక్షతన ఆదివారం జరిగింది. మంజుల మాట్లాడుతూ పాఠశాల విద్యారంగం అనేక ఆటుపోట్లకు గురవుతూ సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రారంభం రోజునే తల్లికి వందనం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రచారం చేసే చర్యలు ప్రభుత్వ పాఠశాలలను కుంగదీస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే తల్లికి వందన చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బసవ లింగారావుతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.