18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: ఏపీటీఎఫ్
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:09 AM
విద్యారంగ సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కోసం రెండో దశ పోరాటంలో భాగంగా ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని...
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): విద్యారంగ సమస్యలు, ఆర్థిక పరమైన డిమాండ్ల సాధన కోసం రెండో దశ పోరాటంలో భాగంగా ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఏపీటీఎఫ్-257 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.బసవలింగారావు తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాష్ట్ర సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట రిటైరైన ఉద్యోగులకు మాత్రమే పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఇతర బకాయిలు చెల్లిస్తూ.. రూ.7034 కోట్లు ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సరెండర్ లీవులు, 11వ పీఆర్‌సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.