Share News

Minister Mandipalli Ramprasad Reddy: ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డు గర్వకారణం

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:54 AM

ఏపీఎస్‌ ఆర్టీసీకి జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గవర్నెన్స్‌ నౌ- ఆరో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సమ్మిట్‌ అవార్డు రావడం గర్వకారణమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి..

Minister Mandipalli Ramprasad Reddy: ఆర్టీసీకి జాతీయస్థాయి అవార్డు గర్వకారణం

  • మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్‌ ఆర్టీసీకి జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక ‘గవర్నెన్స్‌ నౌ- ఆరో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సమ్మిట్‌’ అవార్డు రావడం గర్వకారణమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఆర్టీసీ అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బంది ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించడంతో సేవలో నాణ్యత మరింత మెరుగుపడింది. డిజిటల్‌ సాంకేతికతను ప్రజాసేవకు వినియోగించిన ఆర్టీసీ కృషికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రఽధాన బస్టాపుల్లో ఆటో మేటిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏఏఎస్‌) అమలు ప్రశంనీయం. సాంకేతికతను అందిపుచ్చుకుని, సీఎం చంద్రబాబు విజన్‌కు అనుగుణంగా ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రయాణికులకు మరింత ఆధునిక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తాం. ప్రజా రవాణా రంగంలో మహిళలకు ఉచిత బస్సు, పండుగ వేళల్లో సాధారణ చార్జీలు ఉంచుతూ ఏపీఎ్‌సఆర్టీసీని దేశానికి ఆదర్శంగా నిలబెడతాం. అవార్డు సాధనలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ ఎండీ ద్వరకా తిరుమలరావుకు అభినందనలు’ అని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 05:55 AM