ఎలక్ట్రికల్ బస్సులను ఉద్యోగులతోనే నడపాలి
ABN , Publish Date - Jun 21 , 2026 | 05:20 AM
రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతోనే నడిపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శ
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు
అనంతపురం అర్బన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతోనే నడిపేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శనివారం అనంతపురంలోని వీకే భవన్‌లో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులతో ఉద్యమ సన్నాహక సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు శ్రీనివాసరావు, దామోదర్‌రావు హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి, గేట్ మీటింగ్‌లు, ధర్నాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.