ఆర్టీసీ ఆధునికీకరణకు నిర్ణయం
ABN , Publish Date - May 31 , 2026 | 05:26 AM
ఆర్టీసీ బస్సుల ఆధునికీకరణ, ఈవీ బస్సుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
త్వరలో 3 వేల ఈవీ బస్సులు : మండిపల్లి
అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల ఆధునికీకరణ, ఈవీ బస్సుల విస్తరణ, ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా ఈవీ బస్సుల విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. తొలిదశలో 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి పేరున ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహించనున్నట్లు తెలిపారు.