Share News

ప్రయాణికులకు ఉత్తమ డిజిటల్‌ సేవలు

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:16 AM

ప్రయాణికులకు ఉత్తమ డిజిటల్‌ సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డు వచ్చింది.

ప్రయాణికులకు ఉత్తమ డిజిటల్‌ సేవలు

  • ఏపీఎస్ఆర్టీసీకి మరో జాతీయ అవార్డు

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రయాణికులకు ఉత్తమ డిజిటల్‌ సేవలు అందిస్తున్న ఏపీఎస్ఆర్టీసీకి జాతీయ అవార్డు వచ్చింది. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని డిజిటల్‌ సేవల్లో ఏపీఎ్‌సఆర్టీసీ ముందంజలో కొనసాగుతోంది. ప్రజా రవాణా సంస్థలోని యూనిఫైడ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో డిజిటల్‌ సేవలను, ఆధునిక టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకున్నందుకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. హైదరాబాద్‌లో జరిగిన ఇండియా పీఎ్‌సఈ సమ్మిట్‌లో సంస్థ ఎండీ బాలసుబ్రమణ్యం తరఫున ఐటీ విభాగం సీఈ శ్రీనివాసరావు అవార్డు అందుకున్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సూపర్‌వైజర్లు, సిబ్బందిని ఎండీ ఈ సందర్భంగా అభినందించారు.

Updated Date - Apr 26 , 2026 | 05:18 AM