Share News

యాజమాన్యమే వేతనాలు చెల్లించేలా చూడండి

ABN , Publish Date - May 23 , 2026 | 05:11 AM

ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ యాజమాన్యమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని..

యాజమాన్యమే వేతనాలు చెల్లించేలా చూడండి

  • మంత్రి లోకేశ్‌కు ఆర్టీసీ పొరుగు సేవల కార్మిక సంఘం వినతి

విజయవాడ సిటీ, మే 22(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ యాజమాన్యమే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు వీలుపడని పక్షంలో అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ద్వారానైనా జీతాల చెల్లించేలా చూడాలని ఆర్టీసీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ మంత్రి నారా లోకేశ్‌ను కోరింది. ఈమేరకు ఒక వినతిపత్రాన్ని సంస్థ ప్రధాన కార్యదర్శి టి.గంగాంజనేయులు శుక్రవారం మంత్రికి అందజేశారు.

Updated Date - May 23 , 2026 | 05:13 AM