Share News

ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:42 AM

ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ పిరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలును తప్పనిసరి చేస్తున్నట్టు....

ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత

  • 45 ఏళ్లు పైబడిన వారికి హెల్త్‌ చెకప్‌ తప్పనిసరి

  • ఆర్టీసీ ఎండీ ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం వెల్లడి

బస్‌స్టేషన్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ పిరియాడికల్‌ హెల్త్‌ చెకప్‌ అమలును తప్పనిసరి చేస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఇటీవల ఉద్యోగుల్లో.. ముఖ్యంగా డ్రైవర్లలో గుండె సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధుల కారణంగా మరణాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకే పిరియాడికల్‌ హెల్త్‌ చెక్‌పలు నిర్వహిస్తున్నారు. ఇకపై 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకొకసారి హెల్త్‌ చెకప్‌ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. మే 1 నుంచి ఈ కార్యక్రమం అన్ని డిపోల్లోనూ అమలులోకి వస్తుందన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:42 AM